తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ


Sun,October 6, 2019 03:00 AM

-మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్ : తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తుందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శనివారం మెగా బతుకమ్మ ఉత్సవాలను కలెక్టర్ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంవీ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.విద్యాసాగర్, జిల్లా అధికారులతో కలిసి దాండియా నృత్యాలు చేశారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలుగా మొదటి బహుమతి డీఆర్‌డీఓ, రెండవ బహుమతి మహిళా శిశుసంక్షేమశాఖ, 3వ బహుమతి విద్యాశాఖ, 4వ బహుమతి టీఎన్‌జీఓలను గుర్తించి జ్ఞాపికలు అందజేశారు. డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, జిల్లా అధికారులు, మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...