కథ..అడ్డం తిరిగింది


Sun,October 6, 2019 02:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉద్యోగం చేస్తున్న భార్యకు.. అధిక టార్గెట్‌లు ఇస్తుందనే కోపంతో.. టీం లీడర్ పరువు తీ యాలనుకున్నాడు. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే సోషల్ మీడి యాలో పెట్టిన పోస్టులో అతని భార్య ఫొటో కూడా ఉంది. దీం తో టీం లీడర్ పరువుతీయబోయి.. తన భార్య ప్రతిష్టనే దిగజా ర్చు కున్నాడు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన జాన్ జార్జి ఈసీఐఎల్ రాధిక మల్టీప్లెక్స్‌లో ప్రొజెక్టర్ ఆపరేటర్. అతని భార్య ఓ పేరొందిన ఎలక్ట్రిక్ సామగ్రి విక్రయ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఆ సామగ్రి విక్రయాలకు సం బంధించి టీం లీడర్ తరచూ ఆమెకు టార్గెట్స్ విధిస్తుంది. దీంతో విధుల నిర్వహణలో అధిక సమయం కేటాయిస్తుంది. దీంతో ఉద్యోగం వద్దన్నా.. వెళ్తుంది. దీంతో.. కోపం పెంచుకున్న జాన్.. టీం లీడర్ పరువు తీయాలని భావించాడు. దీని కోసం షేర్ చాట్‌లో టీం లీడర్ ఉన్న గ్రూపు ఫొటో పెట్టి కాల్‌గర్ల్స్ అంటూ టీం లీడర్ ఫోన్ నంబర్ అందులో పేర్కొన్నాడు. ఈ ఫొటోలో అతని భార్య కూడా ఉండడం గమనార్హం. ఇది చూసిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు ఐపీ చిరునామా ఆధారంగా జాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టింది తానేనని వాంగ్మూలం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...