సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి లెటర్‌హెడ్ ఫోర్జరీ


Sun,October 6, 2019 02:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు లెటర్ ప్యాడ్‌ను ఫోర్జరీ చేసిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ షఫీక్ అహ్మద్ రియ ల్ ఎస్టేట్ వ్యాపారి. ఇతనికి అర్జున్‌సింగ్ అనే వ్యక్తి పరిచయమ య్యా డు. శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గ నౌఖల్సా ప్రాంతంలోని ప్రభు త్వ స్థలం సర్వే నం.66/1లో ఉన్న 12,180 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించాలని అర్జున్ సింగ్.. షఫీక్‌తో మాట్లాడాడు. ఇందుకు రూ. 10 లక్షలు షఫీక్‌కు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అనంతరం షఫీక్.. స్థలాన్ని రెగ్యులరైజ్ కోసం ఓ బ్రోకర్‌ను కలిసినా, అది సాధ్యం కాలేదు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శికి సంబంధించిన నమూనాలను సేకరించాడు. దీంతో గత నెల 27న బషీర్‌బాగ్‌లోని ఒక డీటీపీ సెంటర్‌లో ఆ నమూనాల ఆధారంగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుతో ఒక నకిలీ లెటర్ హెడ్‌ను తయారు చేశాడు. అందులో కింద సంతకం ముఖ్యమంత్రి కార్యాలయ ఓస్డీ సంతకం చేశా డు. అనంతరం సీఎం కార్యాలయం నుంచి స్థలం రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అర్డర్ తెప్పించానని, అసలైన కాపీ త్వరలో వస్తుందని అర్జున్‌సింగ్‌ను నమ్మించాడు.

ఆ నకిలీ కాపీని వాట్సాప్‌లో అర్జున్‌సింగ్‌కు పంపించాడు. ఇది నిజమే అని అనుకున్న అర్జున్‌సింగ్.. తనకు ల్యాండ్ రెగ్యులరైజ్ అయ్యిందంటూ ఆ స్థలాన్ని విక్రయించేందుకు మార్కెట్‌లో పెట్టాడు. ఆ స్థలాన్ని కొనేందుకు ముందుకు వచ్చిన ఓ వ్యక్తి.. ఆ కాపీని చూడగా అనుమానం వచ్చింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావును సంప్రదించాడు. అతను సూచి.. అది తనది కాద ని, లెటర్ హెడ్‌ను ఫోర్జరీ చేశారని, ఇది నకిలీదని తేల్చారు. దీనిపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ గోవిందరెడ్డి బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...