మెట్రో..కిటకిట


Sun,October 6, 2019 02:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగర ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా హైదరాబాద్ మెట్రోరైలు కీలకపాత్ర పోషించింది. దీనిలో భాగంగా 3.65లక్షల మంది ప్రయాణికులను చేరవేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 3.06 లక్షల మందిని చేరవేసిన రికార్డును తిరగరాసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణికులను చేరవేయడానికి ముందస్తు ప్రణాళికలు చేసుకున్న హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఉదయం 5గంటల నుంచే సర్వీసులను ప్రారంభించింది. గంట గంటకు రద్దీ పెరుగుతున్నప్పటికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేర్చింది. రద్దీ పెరుగుందని ముందే ఊహించిన అధికారులు నాగోల్-హైటెక్‌సిటీ వరకు, ఎల్బీనగర్-మియాపూర్ వరకు 56కిలోమీటర్ల మార్గంలో 3నిమిషాల ఫ్రీక్వెన్సీతో రైళ్లు నడిపించారు. ప్రయాణికులు కూడా క్యూలో నిలబడి టికెట్లు తీసుకుని ప్రయాణించారు. ప్రతీరోజు నడిపే రైళ్లకు అదనంగా 6 రైళ్లు నడిపారు. రెగ్యులర్ ట్రిప్పులకు అదనంగా 100 ట్రిప్పులు పెంచి 810 ట్రిప్పులను నడిపించినట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం రోజు మొదటి రైలు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని, చివరి రైలు టెర్మినల్స్ నుంచి 11గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...