మల్కాజిగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి


Sat,October 5, 2019 01:02 AM

మల్కాజిగిరి, నమస్తే తెలంగాణ : మల్కాజిగిరి అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గ ముంపు ప్రాంతాలు, ఆర్‌యూబీ, మౌలాలి కమాన్ సమస్యలపై వివిధ రాజకీయ పార్టీలు, కాలనీల ప్రతినిధులతో మల్కాజిగిరిలోని బృందావన్ గార్డెన్‌లో శుక్రవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రేవంత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ మల్కాజిగిరిలో ఉన్న ప్రధాన సమస్యలైన ఆనంద్‌బాగ్ ఆర్‌యూబీ, వరద ప్రాంతాల్లోని నాలా, మౌలాలి కమాన్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పురపాలకశాఖ అధికారులను అదేశించినట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.

నాలా విస్తరణకు నిధులు సిద్ధం : ఎమ్మెల్యే
నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో నాలా విస్తరణ పనులకు నిధులు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నాలా విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 100కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. 12 మీటర్లు ఉండాల్సిన నాలాలు, ప్రస్తుతం రెండున్నర మీటర్ల వరకు కుదించుకుపోవడం వల్ల వరదనీటి సమస్య తలెత్తుతున్నదని చెప్పారు. ఆర్‌యూబీ, మౌలాలి కమాన్ పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం : లోకేశ్‌కుమార్
మల్కాజిగిరిలోని ప్రధాన సమస్యలైన ఆర్‌యూబీ, నాలా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని జీహెచ్‌ంఎసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ అన్నారు. ఆర్‌యూబీ, వరద నీటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆర్‌యూబీ పనుల్లో సాంకేతిక సమస్యలను అధిగమించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు శంకరయ్య, మమతా, ఆర్డీవో మధుసూదన్, డీసీలు వేణుగోపాల్, యాదయ్య, తహసీల్దార్ గీత, వివిధ శాఖల అధికారులు ప్రసాద్‌రావు, అనిల్‌రాజ్, నాగేందర్ కార్పొరేటర్లు జగదీశ్‌గౌడ్, శిరీషా జితేందర్‌రెడ్డి, పుష్పలతరెడ్డి, ఆకుల నర్సింగ్‌రావు, శ్రీదేవి హన్మంతరావు, రాజ్ జితేంద్రనాథ్, సబిత కిశోర్, పలు పార్టీల నాయకులు శ్రీధర్, రాధాకృష్ణయాదవ్, శ్రీను, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...