ఎస్‌బీఐ సేవలు ఉద్యోగులకు ఉపయోగం


Sat,October 5, 2019 01:01 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో ఉద్యోగుల సౌకర్యార్థం ఎస్‌బీఐ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి తెలిపారు. శుక్రవారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్‌లో ఎస్‌బీఐ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు సేవలు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, అదర్ సిన్హా, చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్, జనరల్ మేనేజర్ వి.రమేశ్, డీజీఎం రవీంద్రగౌరవ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ సంధ్య పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...