సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి


Sat,October 5, 2019 01:00 AM

మేడ్చల్ కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో (డీసీసీ) బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీప్‌లో అందించే రుణాలు సకాలంలో అందించనందుకు అసహనం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ముద్రలోన్, స్టాండప్ ఇండియా లోన్‌లు మంజూరు చేసి జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు బ్యాంకులు మందుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకులకు సంబంధించిన కంట్రోలర్ సమావేశాలకు హాజరుకావాలని, లేని పక్షంలో బాధ్యతాయుతమైన అధికారులు సమావేశానికి హాజరుకావాలని బ్యాంకుల ప్రతినిధులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ భుజంగరావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...