మేడ్చల్‌లో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..


Sat,October 5, 2019 12:59 AM

మేడ్చల్ జిల్లాలో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ జిల్లాలో పండిన పంటల వివరాలు, జిల్లా, మండల, గ్రామాల వారీగా, ఏఏ పంటలు అధికంగా పండిస్తున్నారో రైతు వారీగా నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్‌పై రైతుకు ఎప్పటికప్పుడు ప్రచార సాధనాల ద్వారా పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్ ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన సమాచారం వెంటనే ఇవ్వాలని సూచించారు. రైతుబంధు, రైతుబీమా పథకం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గోనే సంచుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం తడవకుండా రైతులకు ఎప్పటికప్పుడు వర్ష సూచన సమాచారం అందించాలని సూచించారు. రైతు సమన్వయ కమిటీలకు సమాచారం ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.జాయింట్ కలెక్టర్ కె. విద్యాసాగర్, జడ్పీ వైస్‌చైర్మన్ బెస్త వెంకటేశ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...