పరిశుభ్రత పాటించని మద్యం దుకాణాలకు జరిమానా..


Sat,October 5, 2019 12:59 AM

కందుకూరు : 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. దీంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం డీఎల్‌పీఓ శ్రీనివాస్‌గౌడ్ కందుకూరు మండలంలో పర్యటిస్తూ గ్రామాల పల్లెప్రగతిని పరిశీలించారు. మండల కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించి అగ్రహం వ్యక్తం చేశారు.రెండు మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్ రూంలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆయన వెంటనే దుకాణానికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతిలో గ్రామాలు స్వచ్ఛతగా తయారైనట్టు తెలిపారు. సర్పంచ్ శమంతకమణి, ఉప సర్పంచ్ వెంకటయ్య, ప్రత్యేక అధికారి,పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...