వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇన్‌సెప్షన్-2019


Sat,October 5, 2019 12:58 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ఇన్‌సెప్షన్-2019 పేరిట ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. సీనియర్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ మనోహర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థులు ఆంగ్లంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. సమాచార,సాంకేతిక పరిజ్ఞానంలో వస్త్తున్న మార్పులను ఎప్పటికప్పుడు నేర్చుకోవడం వల్ల వ్యవసాయ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీమ, కళాశాల ఓఎస్‌ఎ డాక్టర్ పి.రమేశ్‌బాబు ఈ సందర్భంగా జూనియర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జూనియర్, సీనియర్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...