సేవలకు సలాం..


Fri,October 4, 2019 03:14 AM

-విపత్కర స్థితిని చక్కదిద్దుతున్న ఈవీడీఎం
-ఉత్తమ సేవలతో ఆదర్శంగా నిలుస్తున్న విభాగం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విపత్తుల సమయంలోనే కాకుండా ప్రమాదంలో ఉన్నవారికి సహాయమందించడం ద్వారా జీహెచ్‌ఎంసీకి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఈవీడీఎం) విభాగం దేశంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచింది. కేవలం ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో మాత్రమే విపత్తుల నిర్వహణ విభాగం ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీకి చెందిన ఈవీడీఎం విభాగం సుశిక్తులైన సిబ్బందితోపాటు అనేక రకాల సహాయక చర్యలు చేపట్టడం ద్వారా దానికన్నా మెరుగైన విభాగంగా పేరుగాంచడం విశేషం. విపత్తుల్లో సహాయక చర్యలను అందించేందుకు గత ఏడాది మార్చిలో ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకంగా ఈవీడీఎం విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

ఈదురు గాలులతో కూడిన ఆకస్మికంగా వర్షాలకు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిల భవనాలను రికార్డుస్థాయిలో తొలిగించడం, రోడ్లపై ఏర్పడ్డ నీటి నిల్వలను వెంటనే తొలిగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడడంతోపాటు ఆపదలో ఉన్న జంతువులు, పక్షులను కాపాడడం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి ప్రథమ చికిత్సను అందించడం, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తగిన సహాయక చర్యలు అందించడం తదితర చర్యల ద్వారా జీహెచ్‌ఎంసీకి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఈవీడీఎం) విభాగం దేశంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదర్శంగా మారింది. ప్రత్యేక వాహనాలు, యంత్ర సామగ్రి, ఆధునిక సాంకేతిక వ్యవస్థ, ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్ ఈ విభాగం ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. నగరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రమాదాలకు ఆస్కారముండే ఏరియాల్లో దాదాపు 220 మంది సిబ్బందితో 13 బృందాలు 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో సిద్ధంగా ఉండే ఈవీడీఎంకు చెందిన విపత్తుల నివారణ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

కూలిన చెట్లు తొలిగించి...
ఇటీవల రామంతాపూర్‌లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఉన్న భారీ రావివృక్షం కూలింది. అత్యంత పురాతన ఆలయంలో ఉన్న ఈ వృక్షం కూలినట్లు సమాచారం అందిన వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్‌ఫోర్స్ బృందాలు అక్కడికి చేరుకొని తొలిగించాయి. అలాగే, అడిక్‌మెట్‌లోని రామాలయంలో దాదాపు 40 ఏండ్ల నాటి వృక్షం కూలడంతో దాన్ని సైతం ఆలయానికి, పరిసర ఇండ్లకు నష్టం జరుగకుండా చాకచక్యంగా తొలిగించాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. చెట్లు కూలిన సమాచారం అందిన వెంటనే వాటిని తొలిగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడడంలో డీఆర్‌ఎఫ్ బృందాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...