కోకాపేట్ రోటరీ వద్ద వన్‌వే


Fri,October 4, 2019 03:10 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కోకాపేట్ రోటరీ, ఓఆర్‌ఆర్ నుంచి కోకాపేట్ రోటరీ సర్వీసు రోడ్డు ప్రాంతంలో నివాస సముదాయాలు, వాణిజ్య సముదాయాలు పెరుగడంతో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతి రోజు ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ, జామ్‌లు ఏర్పడుతున్నాయి. దీనిలో భాగంగా పాదచారులు, వాహనదారులు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గంలో వన్‌వే ట్రాఫిక్‌ను అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎమ్ విజయ్‌కుమార్ గురువారం తెలిపారు. ఈ వన్‌వే ట్రాఫిక్ కోకాపేట్ ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు రోటరీ(ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వైపు) నుంచి వెహిక్యూలర్ అండర్ పాస్ వెర్టెక్స్ పనాచే దగ్గర నుంచి కోకాపేట్ రోటరీ(జీఏఆర్ వైపు) వరకు అమల్లో ఉంటుంది.

మార్గాలకు సంబంధించిన వివరాలు...
-ఐఎస్‌బీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వైపు నుంచి జీఏఆర్ బిల్డింగ్ వైపు వెళ్లే వాహనాలు ఎడమ వైపు తిప్పుకుని ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు మీదుగా కోకాపేట్ రోటరీ-1 వీయూపీ దగ్గర కుడి వైపు తీసుకుని వెర్టెక్స్ పనాచే నుంచి జీఏఆర్ బిల్డింగ్‌కు చేరుకోవాలి.

-ఐఎస్‌బీ నుంచి జీఏఆర్ బిల్డింగ్‌కు వయా కోకాపేట్ అండర్‌పాస్ రోటరీకి నేరుగా వెళ్లేందుకు వాహనాలను అనుమతించరు.
-కొల్లూరు నుంచి ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు మీదుగా నార్సింగి వైపుగా నేరుగా వెళ్లడానికి వాహనాలను అనుమతించరు. ఈ వాహనదారులు కోకాపేట్ రోటరీ దగ్గర ఎడమ వైపునకు తీసుకుని ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ మీదుగా వీయూపీ, వెర్టెక్స్ పనాచే వైపు వెళ్లాలి. ఈనెల 14 నుంచి ఈ వన్‌వే ట్రాఫిక్ అమల్లోకి వస్తుందని డీసీపీ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వాహనదారులు, పాదచారుల భద్రత కోసమేనని గ్రహించాలని డీసీపీ కోరారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...