గణేశ్ నిమజ్జన కొలనుల్లో గంబూసియా చేపలు


Fri,October 4, 2019 03:10 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ తాజాగా 23 గణేశ్ నిమజ్జన కొలనుల్లో గంబూసియా చేపలను వేస్తున్నారు. దోమల ఉత్పత్తికి కారణమయ్యే లార్వా నివారణకు దాదాపు 50వేలకుపైగా గంబూసియా చేపలను వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం చెరువుల వద్ద జీహెచ్‌ఎంసీ కొలనులను నిర్మించిన విషయం విదితమే. నిమజ్జనం పూర్తికావడంతో అవి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారే అవకాశం ఉండడంతో జీహెచ్‌ఎంసీ గంబూసియా చేపలను వదిలే కార్యక్రమాన్ని చేపట్టింది. 50వేల గంబూసియా చేపలు నెలరోజుల్లో ఐదు లక్షలకు పెరుగుతాయని, మిగిలిన చేపల్లా ఇవి గుడ్ల పెట్టవని, నేరుగా పిల్లలనే ఉత్పత్తి చేస్తాయని అధికారులు తెలిపారు. 2375 మంది దోమల నివారణ విభాగం సిబ్బంది చేపలను వదిలే పనుల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. వీటితోపాటు యథావిథిగా దోమల నివారణ మందు పిచికారీ, ఫాగింగ్ పనులు కొనసాగుతున్నట్లు వారు వివరించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...