వ్యర్థాల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం


Fri,October 4, 2019 03:09 AM

-రసాయన ఇండస్ట్రీ జాతీయ సెమినార్‌లో ఎండీ దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇంజినీర్స్ ఇనిస్టిట్యూట్ తెలంగాణ స్టేట్ సెంటర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో రీసెంట్ డెవలప్‌మెంట్ ఇన్ టెక్నాలజీస్ ఆఫ్షన్స్ ఫర్ రిసోర్స్ రికవరీ ఇన్ కెమికల్ ప్రాసెస్ ఇండస్ట్రీ అనే అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. రసాయన ఇండస్ట్రీపై జరిగిన ఈ సెమినార్‌కు జలమండలి ఎండీ దానకిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొని సర్క్యూలర్ ఎకానమీ అనే అంశంపై మాట్లాడారు. వ్యర్థాల నుంచి వనరులను తిరిగి పొందడానికి సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరమని తెలిపారు. మున్సిపల్ ల్యాండ్‌ఫిల్స్‌ను తగ్గించడానికి హోమ్ గ్రోన్ టెక్నాలజీల ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో ఐఏఎస్ కల్యాణ చక్రవర్తి, ఐఐఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్ ఎస్‌వీ సత్యనారాయణ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మన్ జి.రామేశ్వరరావు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...