మెట్రో ప్రమాదంపై సీఎంఆర్‌ఎస్ ప్రజాభిప్రాయ సేకరణ


Fri,October 4, 2019 03:08 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మెట్రో ప్రమాదంపై మెట్రోరైలు భవన్‌లో సీఎంఆర్‌ఎస్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జేకే గార్గ్ గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మెట్రోరైలు నిర్మాణంలో ఉన్న లోపాలు, ప్రమాదకరమైన ప్రాంతాలపై వివిధ సంఘాలు, సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. దాదాపు 30 సంస్థలు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అమీర్‌పేట మెట్రో ప్రమాదం నేపథ్యంలో కేంద్ర మెట్రోరైలు సేఫ్టీ చట్టబద్ధ విచారణ కమిషన్ విచారణ చేపట్టింది. వాటర్ లీకేజీలు, ఊడుతున్న పెచ్చులు, డివైడర్ గ్యాప్‌లపై చర్చ జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు తమ అభిప్రాయాలను సీఎంఆర్‌ఎస్ దృష్టికి తీసుకువచ్చారు. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీరెడ్డి పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...