108లో ప్రసవం తల్లీబిడ్డ క్షేమం


Fri,October 4, 2019 03:08 AM

మలక్‌పేట, నమస్తే తెలంగాణ : ప్రసవం కోసం దవాఖానకు తరలిస్తున్న గర్భిణి 108అంబులెన్స్‌లోనే ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రవి, గోరి దంపతులు జీవనోపాధికోసం నగరంలోని బడంగ్‌పేటలో నివాసముంటున్నారు. నిండు గుర్భిణి అయిన గోరికి గురువారం రాత్రి పురిటినొప్పులు రావడంతో ఓలా క్యాబ్‌లో దవాఖానకు బయలు దేరారు. పరిస్థితి తీవ్రమవడంతో వెంటనే కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించగా సంతోష్‌నగర్ చౌరస్తా వద్ద 108 సిబ్బంది ఓలా క్యాబ్‌లో నుంచి గర్భిణిని అంబులెన్స్‌లోకి షిఫ్ట్‌చేసి పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానకు పయనమయ్యారు. నల్గొండ చౌరస్తా వద్దకు చేరుకోగానే గోరి ప్రసవించిమగబిడ్డకు జన్మనిచ్చింది. దీఅంబులెన్స్‌లోని ఈఎంటీ శ్రీశైలం, పైలట్ సారథిలు తల్లీబిడ్డను కోఠి ప్రసూతి దవాఖానకు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...