నగరంలో విస్తృతంగా స్వచ్ఛ కార్యక్రమాలు


Thu,October 3, 2019 02:52 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం జీహెచ్‌ఎంసీ ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతకు నగరవ్యాప్తంగా ప్లాగింగ్ నిర్వహించింది. మార్నింగ్ వాకర్లతోపాటు అధికారులు, సిబ్బంది పార్కులు, రోడ్లపై తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ర్యాలీలు, వీధి నాటకాల ద్వారా ప్రచారం నిర్వహించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో కూడా ఉద్యమరూపంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించి దీనికోసం గాంధీ జయంతిని ముహూర్తంగా నిర్ణయించింది. దశలవారీగా ప్లాస్టిక్‌ను సమూలంగా నిర్మూలించాలని నిశ్చయించారు. ముందుగా జీహెచ్‌ఎంసీకి చెం దిన పార్కులు, పర్యాటక ప్రాంతాల వద్ద ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా కనిపించకుండా చేయాలని నిశ్చయించారు.

ఈ నేపథ్యంలో బుధవారం నగరవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతకు పాశ్చాత్య దేశాల తరహాలోనే ప్లాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. పా ర్కులు, రోడ్లపై ప్లాస్టిక్ బాటిళ్లు, కాగితాలు, ప్లాస్టిక్ కవర్లను తొలిగించారు. ముఖ్యంగా సౌత్‌జోన్ పరిధిలో బల్దియా అధికారులు, సిబ్బంది రోడ్ల వెం బడి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుతూ బస్తాల్లో నిం పారు. పార్కులు, పర్యాటక ప్రాంతాలు, ఆట మై దానాలు, రహదారులపై ప్లాగింగ్ నిర్వహించారు. చార్మినార్ వద్ద నిర్వహించిన ప్లాగింగ్ కార్యక్రమంలో బ్రిటిష్ హైకమిషనర్‌తోపాటు ఎన్‌టీపీసీ అధికారులు కూడా పాల్గొన్నారు. స్వచ్ఛ ఐకానిక్ కార్యక్రమం కింద ఎన్‌టీపీసీ చార్మినార్ అభివృద్ధి కి నిధులు సమకూర్చుతున్న విషయం విదితమే. అలాగే, మియాపూర్ కూరగాయల మార్కెట్‌లో ప్లాగింగ్, సనత్‌నగర్, అమీర్‌పేట్ డివిజన్లలో స్వ చ్ఛ హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ప్లాస్టిక్‌ను వాడరాదని ప్రతిజ్ఞ చేశారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లతోపాటు కార్పొరేటర్లు, కాలనీ సంఘాలు,స్వచ్ఛందసంస్థలు పాల్గొన్నారు.

ఇక నుంచి రోజూ వార్డులవారీగా ప్లాగింగ్
ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యప్రణాళిక రూపొందించిన జీహెచ్‌ఎంసీ, ముందుగా చారిత్రక, వారసత్వ, పర్యాటక ప్రాంతాలైన చార్మినార్, గోల్కొండ, కులీ కుతుబ్‌షా సమాధులు, బిర్లా మందిర్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, శిల్పారామం, ట్యాంక్‌బండ్ తదితర పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, నగరవాసులను భాగస్వాములను చేస్తూ ప్లాస్టిక్ నిషేధంపై చైతన్య కార్యక్రమాల నిర్వహణ, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టడం, స్వచ్ఛతపై కార్యక్రమాలు, ప్రతిజ్ఞలు, స్వచ్ఛత ర్యాలీలు నిర్వహించాలని నిశ్చయించారు. ప్రతిరోజూ జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది, ఉద్యోగులతో ఒక్కోవార్డులో ప్లాగింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని, ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను డ్రై రిసోర్స్ సెంటర్ వద్ద డిపాజిట్ చేయాలని నిశ్చయించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...