సీవరేజి పనులకు రోబోలను వినియోగిస్తాం


Wed,September 18, 2019 02:53 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కేరళ రాష్ట్రంలో అమలుచేస్తున్న విధంగా సీవరేజి పైప్‌లైన్ల శుభ్రతలో రోబోల వినియోగంపై దృష్టి సారిస్తామని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు జగదీష్‌హీరేమణి తెలిపా రు. దేశవ్యాప్తంగా సీవరేజి పనులను ఆధునిక యంత్రా ల ద్వారా చేపట్టాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పారిశుధ్యలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అంశం పై వచ్చే నవంబర్‌లో జాతీయ సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో మాన్యువల్ స్కావెంజింగ్, పునరావాస చట్టం-2013 అమలు, స్కావెంజర్ల స్థితిగతులపై మంగళవారం జగదీష్‌హీరేమణి జీహెచ్‌ఎంసీ ప్రధానకార్యాలయంలో అధికారులు, సఫాయి కర్మచారి సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సీవరేజి పనుల్లో రోబోల వినియోగంపై ఐఐటీ, ఐఐఎంలకు చెందిన నిపుణుల సలహాలు కూడా తీసు కోనున్నట్లు చెప్పారు. మాన్యువల్ స్కావెంజింగ్‌పై ఆధారపడి ప్రస్తుతం ఆ పనులను మానేసినవారి పునరావాసానికి చర్యలు చేపట్టాలని, దీనిపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో 353మంది మాన్యువల్ స్కావెంజింగ్ పనుల్లో ఉన్నట్లు సర్వేలో తేలిందని, వారికి వైద్య చికిత్సలు అందించడమే కాకుండా పునరావాసానికి చర్యలు తీసుకోవాలని, వారి పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. వారి వివరాలు తమకు పంపితే ఒక్కో కుటుంబానికి కేంద్రం ద్వారా రూ.40వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో విధి నిర్వహణలో మరణించిన 40మంది పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. గతంతో పోల్చుకుంటే నగరంలో పారిశుధ్య కార్మికుల స్థితిగతులు మెరుగైనట్లు జగదీష్ అభిప్రాయపడ్డారు.

మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధం
నగరంలో మాన్యువల్ స్కావెంజింగ్‌ను ఇదివరకే నిషేధించినట్లు, సీవరేజి పనుల కోసం జీహెచ్‌ఎంసీ 69 జెట్టింగ్ మిషన్లను వినియోగిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. పారిశుధ్య కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు రక్షణ గ్లౌజ్‌లు, రెయిన్‌కోట్లు, మాస్కులు, ఇతర కసౌకర్యాలు సమకూర్చుతున్నట్లు తెలిపారు. నగరానికి ఓడీఎఫ్++ హోదా లభించడం వెనుకు కార్మికుల పాత్ర ఉందన్నారు. మహిళా కార్మికులకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. సమావేశానికి ముందు హీరేమణిని సన్మానించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...