గిఫ్ట్ వచ్చిందని పిలిచి.. ప్లాట్ల విక్రయం


Wed,September 18, 2019 02:49 AM

హిమాయత్‌నగర్ : లక్కీ డ్రాలో బహుమతి వచ్చిందని పిలిచి.. తక్కువ ధరకు ప్లాట్లు విక్రయిస్తామని మోసాలకు పాల్పడుతున్న గ్లోబల్ తాజ్‌ప్రైడ్ సర్వీస్ సంస్థ నిర్వాహకులపై బాధితులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సైదులు కథనం ప్ర కారం .. హిమాయత్‌నగర్‌లో గ్లోబల్ తాజ్‌ప్రైడ్ సర్వీస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి.. నగరంలోని మల్టీప్లెక్స్, హైపర్‌మార్కెట్లు, పెట్రోల్ బంక్‌లు, షాపింగ్‌మాల్స్‌ల వద్ద సంస్థకు సంబంధించిన మార్కెటింగ్ ప్రతినిధులతో వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లను సేకరిప్తారు. అనంతరం వారికి ఫోన్ చేసి లక్కీ డ్రాలో మీకు బహుమతి వచ్చిందని.. దాన్ని తీసుకువెళ్లేందుకు దంపతులు మాత్రమే రావాలని చెబుతారు. అక్కడికి వెళ్లిన తర్వాత యాదాద్రి, ఆలేరు, కల్వకుర్తి, షాద్‌నగర్‌లలో తక్కువ ధరకే ప్లాట్లు అమ్ముతామని ఆశ పుట్టించి.. ఒక్కొక్కొరి నుంచి రూ.లక్ష వసూలు చేసి... ప్లాట్లను చూపించకుండా కాలయాపన చేస్తున్నారు. బాధితులు జీఎన్ జ్యోతి, భాగ్యలక్ష్మి రూ.2.50లక్షలు, నజీమా బేగం రూ.30వేలు, నస్రీన్ సుల్తానా రూ.1లక్ష, అలాగే రేబికా, కల్పన, ప్రవీణ్‌బేగం, షేక్ బాబా, సమీనా తదితరులు డబ్బులు చెల్లించారు. ఏడాదిన్నర అవుతున్నా.. నిర్వాహకులు ప్లాట్లు చూపించడంలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్లోబల్ తాజ్‌ప్రైడ్ సర్వీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు సలావుద్దీన్, శివకుమార్, షపీ ,బ్రాంచ్ మేనేజర్ శేఖర్‌లపై కేసులు నమోదు చేశారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...