ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి


Wed,September 18, 2019 02:48 AM

కాచిగూడ : దక్షిణ మధ్య రైల్వేలో స్వచ్ఛతకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు, పరిశుభ్రతలో దక్షిణ మధ్య రైల్వేకు దేశంలోనే రెండవ స్థానం దక్కడం శుభపరిణామమని రైల్వే హైదరాబాద్ డీఆర్‌ఎం ఎన్.సీతారామప్రసాద్ అన్నారు. స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా స్వచ్ఛ్ రైల్.. స్వచ్ఛ్ భారత్ అనే కార్యక్రమాన్ని మంగళవారం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఆర్‌ఎం సీతారామప్రసాద్‌తోపాటు రైల్వే అధికారులు పాల్గొని కాచిగూడ రైల్వేస్టేషన్ వెనుక భాగం, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు రైల్వే అధికారులు, సిబ్బందితో రైల్వే డీఆర్‌ఎం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా ఉద్యమించాలని, రాబోయే తరాల కోసం ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడితే కలిగే అనర్థాలను వివరిస్తూ కరపత్రాలను కాచిగూడ రైల్వేస్టేషన్‌లో, పలు రైళ్లలో ప్రయాణికులకు పంచుతూ అవగాహన కల్పించారు. ఏడీఆర్‌ఎం ఆపరేషన్స్ హేమ్‌సింగ్ బానోత్, సీనియర్ డీసీఎం వెంకన్న, సీనియర్ డీఎంఈ డి.వాసుదేవయ్య, సీనియర్ డీపీఓ శ్రీరాములు, సీనియర్ డీఎస్‌సీ సెంతిల్, సీనియర్ డీఎఫ్‌ఎమ్ హరిశ, వెల్లంకి, సీఎంఎస్ డాక్టర్ నాగ ప్రసూణ, డీఎస్టీఈ రాజ్యలక్ష్మి, సీడీఓ జోగారావు, స్టేషన్ డైరెక్టర్ మేఘనాథం, హైదరాబాద్ పీఆర్‌ఐ శైలేందర్‌కుమార్, మేనేజర్ రవీందర్, బసవారాజు, లక్ష్మీరెడ్డి, వరప్రసాద్, రఫీక్, అనితా చావాలి, సుధాజైన్‌పాటు వివిధ శాఖల రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...