ప్రజావాణికి ఎవరైనా రావొచ్చు


Wed,September 18, 2019 02:48 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి జర్నలిస్టులకు అనుమతి లేదంటూ సమావేశ మందిరం నుంచి బయటికి పంపించిన జేసీ రవి తీరును మంగళవారం విలేకరులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం జరిగే సమావేశ మందిరంలోకి జర్నలిస్టుల ప్రవేశం, కవరేజ్‌పై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమానికి అందరూ హాజరుకావచ్చని, సమావేశ మందిరంలో ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానం కానీ, రావద్దన్న ఆంక్షలు కానీ లేవని కలెక్టర్ చెప్పారు. ప్రజావాణి కార్యక్రమానికి జర్నలిస్టులు రావడం, కవర్ చేయడం సర్వ సాధారణమేనని గుర్తు చేశారు. ప్రజావాణి సమావేశ మందిరంలో అధికారుల మాదిరిగా మీడియాకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపులు లేకున్నా..ఖాళీగా ఉన్న సీట్లలో అధికారులకు ఇబ్బంది కలుగకుండా జర్నలిస్టులు కూర్చోవచ్చన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి జర్నలిస్టులు రావద్దని, ఉండొద్దని చెప్పడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఎన్నడూలేని విధంగా ప్రజావాణి సమావేశ మందిరం నుంచి జర్నలిస్టులను బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో? దానికి గల కారణాలపై విచారిస్తానని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...