తెలుగు సాహిత్యానికి కోవెల


Tue,September 17, 2019 02:19 AM

తెలుగు యూనివర్సిటీ: తెలుగు విశ్వద్యాలయం విస్తరణ సేవా విభాగం పక్షాన సోమవారం వర్సిటీలోని సమావేశమందిరంలో ఆచార్య కోవెల సంపత్‌కుమారాచార్య స్మారకోపన్యా సాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆచార్య కోవెల చందస్సుకు మానవ రూపమని, ఆయన తెలుగు సాహిత్యానికి కోవెలగా నిలిచారన్నారు. అతి నిరాడంబరుడిగా, సాహితీలోకంలో రాణించిన సుగుణాత్ముడు కోవెల అని గుర్తు చేశారు. కాకతీయ విశ్వ విద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఎస్ లక్ష్మణమూర్తి ప్రసంగిస్తూ సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో పుట్టిన సంపత్‌కుమారా చార్యులు బహుభాషా పండితుడని, ఆయన స్మరించని తెలుగు సాహిత్యం లేదని అన్నారు. స్థితప్రజ్ఞుడిగా తెలుగు సాహిత్యలోకంలో అజాతశ్రత్రువుగా నిలిచిపోయారన్నారు. గురు వుల ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండడం వలన అంతరంగంలో భక్తి మెండుగా ఉం డేదని అన్నారు. వీరు రాసిన కావ్యాలలో అంతర్మథనం, ఆముక్తం, చింతమంతి, మూడు కావ్యా లు, వైష్ణవ సాంప్రదాయ కావ్యాలుగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. దీర్ఘ సమా సాలతో, ద్రావిడ సంప్రదాయంతో కూడిన అచ్ఛతెలుగులో పద్యాలు రాసేవారని అన్నారు. కార్యక్రమంలో కోవెల వారి సమీప బంధువు డి. లక్ష్మణాచారి మాట్లాడుతూ వారితో గల కుటుంబభాందవ్యాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య లేఖ్య పుంజాల అధ్యక్షత వహించగా రామ్మూర్తి స్వాగతం పలికారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...