హైదరాబాద్‌లో ఓలా బైక్‌లు


Fri,September 13, 2019 02:20 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలోకి ఓలా బైక్‌లు రానున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ర్టాల్లో ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా 150 నగరాల్లో సంవత్సరంలోగా 3 లక్షల బైక్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్, చండీగఢ్, కోల్‌కత్తా, బీహార్ ఇన్ గయా, రాజస్థాన్‌లోని బికనీర్, ఉత్తరప్రదేశ్‌లోని ముఘాల్‌సరాయితోపాటు ఇతర పట్టణాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుండటంతోపాటు వాహనాలు రోడ్డును ఆక్రమిస్తున్న సమయంలో ప్రయాణ వేగం నగరాల్లో తగ్గుతున్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని బైక్ ప్రయాణం సులువుగా ఉంటుందని భావించి బైక్ ట్యాక్సీలను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఓలా చీఫ్ సేల్స్ మార్కెటింగ్ ఆఫీసర్ అరుణ్ శ్రీనివాస్ త్వరగా గమ్యాన్ని చేరుకునేందుకు బైక్‌లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాల్లో బైక్‌లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...