జాతీయ సమావేశాన్ని జయప్రదం చేయాలి


Fri,September 13, 2019 02:20 AM

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి
తార్నాక : ఏబీసీడీ వర్గీకరణే లక్ష్య సాధనగా ఉమ్మడి రాష్ర్టాల నుంచి మాదిగలు ఐక్యం కావాలనే ఉద్దేశంతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగే మాదిగల జాతీయ సమావేశంలో మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. శనివారం ఆయన తార్నాకలో విలేకర్లతో మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణపై దాటవేత ధోరణిని అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఉమ్మడి రాష్ర్టాల నుంచి మాదిగలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు సమరశంఖారావం ప్రారంభం కానున్నదన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో జరిగే మాదిగల ఉద్యమ కార్యాచరణకు రూపం దాల్చుకునే ఈ జాతీయ సమావేశం క్రియాశీలకం కానున్నదని, మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...