ప్రజల భాగస్వామ్యంతోనే పనులు విజయవంతం


Thu,September 12, 2019 05:02 AM

కీసర: ప్రజల భాగస్వామ్యంతో పనులు విజయవంతం అవుతాయని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి పేర్కొన్నా రు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగం గా మండలపరిధిలోని చీర్యాల్ గ్రామాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్తులు హరితహారంలో భాగంగా మొక్కలు బాగా నాటారని, ఇంకా నాటాలని, ప్రధానంగా దళిత వాడలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కలను సంరక్షించుకోవాలని, పాదుచేసుకొని, కలుపు తీసుకొని పశువులు, మేకలు తినకుండా రక్షణ కోసం ఐరన్ ట్రీగార్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామస్తులు ఇంటి ఎదుట నాటిన మొక్కలను వారే సంరక్షించుకోవాలని సూచించారు.

పారిశుధ్యవారంలో భాగంగా గ్రామంలో పాడుబడిన బావులను పూడ్చివేయాలని, పాత భవనాలను, గోడలను నిర్మూలించుట, ఖాళీగా ఉన్న ప్లాట్లలో సంబంధిత యాజమాని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, ఇండ్లపై ఉన్న వైర్లను, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పెన్సింగ్ చేయించాలని, వీధిదీపాలు పగటిపూట వెలుగకుండా ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. గ్రామంలోని చెరువులను పూడికతీసి కట్టవెడల్పు చేసుకొనేందుకు గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.5లక్షలు కేటాయించి పనులు చేసుకోవాలని, ఇంకా మిగతా ఖర్చులు దాతల నుంచి సేకరించాలని కోరారు. గ్రామాల్లో ఉన్న చెరువులను మినీ ట్యాంక్ బండ్‌లుగా చేసుకోవాలని, గ్రామం లో డంపింగ్ యార్డు కోసం 2 ఎకరాల వరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని, చెత్తను డంపింగ్ యార్డులోనే వేయాలని, తడిపొడి చెత్తను వేరుచేసి వెర్ని కంపోజ్ చేసుకోవాలని సూచించారు.

గ్రామంలోని వైకుంఠ దామం ఒకటిన్నర ఎకరంలో ఉందని, అందులో దహనవాటికలు, స్నానపు గదులు అవసరమైన మౌలిక వసతులు ఉపాధిహామీ పథకం కింద చేసుకోవాలన్నారు. గ్రామం లో పార్కు లేనుందున 7 ఎకరాలు కేటాయించడం జరుగుతుందని, దాంట్లో వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు, వృద్ధులకు, గ్రామస్తులకు ఫిక్‌నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దుకోవాలన్నారు. అంతకుముందు దళితవాడలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను సందర్శించా రు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కీసర ఆర్డీఓ లచ్చిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ,సర్పంచ్ తుంగ ధర్మేందర్, ఉపసర్పంచ్ జిల్లాల తిరుమలరెడ్డి, డీపీఓ రవికుమా ర్, కీసర ఎంపీడీఓ శశిరేఖ, తహసీల్దార్ నాగరాజు, టీఆర్‌ఎస్ నాయకులు శివలింగాల శ్రీనివాస్‌గౌడ్, బోడ జంగయ్య, రామిడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...