సంక్షేమ శాఖలపై కలెక్టర్‌ నజర్‌


Wed,September 11, 2019 12:44 AM

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : సంక్షేమ శాఖలపై మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీరెడ్డి దృష్టి సారించారు. గతానికి భిన్నంగా పది వార్షిక పరీక్షలకు సుమారు ఆరునెలల ముందు నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో పాటు ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విద్యాశాఖ అధికారులతో పాటు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు 100శాతం ఫలితాలు రాబట్టేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ముఖ్యంగా వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రత్యేక ట్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామని సంక్షేమశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్త్తున్న విద్యార్థులు ఏఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. సబ్జెక్టులపై పట్టు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారిని మానసికంగా వార్షిక పరీక్షలకు ముందు నుంచే సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అలాగే 2020 మార్చి 31నాటికి 2019-20 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న స్వయం ఉపాధి రుణాలను 100శాతం గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులకు అధికారులు రుణ మంజూరు ఇచ్చినప్పటికీ బ్యాంకుల నుంచి లబ్ధిదారులందరికీ ఎంపిక చేసుకున్న కాన్సెంట్‌ రాలేదు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన లబ్ధిదారులందరికీ బ్యాంకు కాన్సెంట్‌ను వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ అంశంపై త్వరలోనే కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు జిల్లా సంక్షేమశాఖ అధికారులు పేర్కొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...