ఒక్క పిలుపుతో ..30వేల నోటు పుస్తకాలు


Wed,September 11, 2019 12:43 AM

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ : పూల బొకేలు,శాలువాలు,స్వీట్లకు అయ్యే డబ్బులతో పేద విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు ఇవ్వాలనే ఒకే ఒక్క పిలుపుతో సుమారుగా 30వేల పుస్తకాలు ఒకే రోజులో అందాయి. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పిలుపుతో స్పందించిన కార్యకర్తలు,అభిమానులు మంగళవారం జిల్లాలో ఉన్న ఆర్కేపురం గ్రీన్‌హిల్స్‌ కాలనీ క్యాంపు కార్యాలయంలో పెద్దఎత్తున తరలి వచ్చి నోటు పుస్తకాలను అందజేశారు. తెలంగాణ ప్రథమ మహిళామంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన సబితారెడ్డిని అభినందించడానికి పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. పూల బొకేలు,శాలువాలు ఇచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనం ఉండదని,రాసుకునే నోట్‌ పుస్తకాలు ఎంతోమంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి సబితారెడ్డి పిలుపుతో స్పందించిన పార్టీ శ్రేణులకు ,ప్రజాప్రతినిధులకు,అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే విధమైన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనలో దాతలు కూడా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చిన నోట్‌ పుస్తకాలను చూస్తే చాలా సంతోషం వేస్తుందన్నారు. వీటిని త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు అందిచనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

బ్యాగు భారమవుతోంది.. ఓ బాలుడు
ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుకొనే ఓ బుడతడు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి ఓ ప్రశ్న వేశాడు. నేను స్కూల్‌కి వెళ్తున్నా..నా బ్యాగు భారంగా ఉందన్నడంతో మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసేందుకు తల్లిదండ్రులతో కలిసి ఓ బాలుడు గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని మంత్రి ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా మంత్రి ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకొని ఎక్కడ చదువుకుంటున్నావ్‌..నువ్వు ఏ క్లాస్‌.. అని అడిగి తెలుసుకున్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...