మా గ్రామాభివృద్ధికి మేమున్నాం


Wed,September 11, 2019 12:41 AM

కీసర : గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పలువురు గ్రామస్తులు భాగస్వాములై ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మేమున్నామంటూ దాతలు ముందుకువచ్చారు. ఊరు మాకేమి ఇచ్చిందని కాదు మనం ఊరికేం చేశామన్నదే ముఖ్యమంటూ తమ సేవాతత్పరతను చాటుకున్నారు. గ్రామాలను బాగుచేసుకొనే క్రమంలో తమవంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. దాతలు ముందుకొచ్చి వస్తువులు, నగదు, వస్తురూపంలో సహాయం చేస్తున్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నెలరోజుల పాటు గ్రామాల్లో చేపట్టేబోయే కార్యక్రమాలపై చర్చించి చాలామంది దాతలు నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా ఈ కార్యాచరణపై గ్రామాభివృద్ధికి దాతల నుంచి పూర్తి సహకారం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామసభలో దాతలు స్వచ్ఛందంగా ఊరికి తమవంతు సహకారం చేయాలని ముందుకొస్తున్నారు.

దాతల సహకారం ...
మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశానుసారం ఒక్కో గ్రామం నుంచి ముగ్గురి చొప్పున కో-ఆప్షన్‌ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.ఆ సభ్యులే గ్రామానికి విరాళం ఇచ్చి సేవచేయడానికి పూనుకున్నారు. కీసర మండలం రాంపల్లిదాయర నుంచి కందాడి హన్మంత్‌రెడ్డి స్వచ్ఛందంగా తమ సొంత గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ను విరాళంగా అందజేశారు. తిమ్మాయిపల్లి గ్రామం నుంచి మల్లారపు సురేందర్‌గౌడ్‌ రూ.1.7లక్షలు, యాద్గార్‌పల్లిలో జూపల్లి లక్ష్మీనారాయణ రూ. 4లక్షలు , ఆరేపల్లి సత్యనారాయణ రూ.3లక్షలు , నర్సంపల్లిలో ఎం.సంజీవ రూ.4.67 లక్షలు, కీసర హెడ్‌క్వార్టర్‌ నుంచి చిత్తార్ల రమేశ్‌గౌడ్‌ రూ.5లక్షలు, కరీంగూడలో కందాడి శివంరెడ్డి రూ.2లక్షలు, గోధుమకుంట గ్రామం నుంచి రూ.1లక్ష, చీర్యాల్‌ గ్రామంలో ఎస్‌.శ్రీనివాస్‌గౌడ్‌ రూ.1లక్ష, ట్రాక్టర్‌ ట్రాలీ, భోగారంలో మెట్టు నర్సింహ రూ.1 లక్ష, ట్రాక్టర్‌, ట్రాలీ, అంకిరెడ్డిపల్లి నుంచి పుల్ల నరేశ్‌ రూ.1 లక్ష విరాళంఇవ్వడానికి దాతలు ముందుకొచ్చారు.ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...