డివిజన్‌కు రెండు.. 300 బస్తీ దవాఖానలు


Tue,September 10, 2019 04:53 AM

-క్యాబినెట్ ఆమోదం కోసం ప్రతిపాదన
-నేటినుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు
-ఉదయం ఐదున్నరనుంచే పారిశుధ్య పనుల పర్యవేక్షణ
-వారం రోజుల్లో1000 వల్నరబుల్ గార్బేజ్ పాయింట్ల తొలగింపు
-అంటు వ్యాధులు అదుపులోనే ఉన్నాయి
-ప్రజల భాగస్వామ్యంతో..వ్యాధుల నివారణకు చర్యలు
-15మంది ఎంటమాలజిస్టులను నియమిస్తాం
-కాలాలకు అనుగుణంగా..వ్యాధులపై క్యాలెండర్ రూపొందించాలి
-డెబ్రిస్ వేసే వాహనాలను సీజ్ చేస్తాం
-బల్దియాలో విస్తృతస్థాయి సమావేశంలో..రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
-హాజరైన మంత్రి ఈటల, మేయర్ బొంతు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అంకితభావంతో పనిచేస్తూ నగరాభివృద్ధికి పాటుపడాలని, చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తిచేసేందుకు కృషిచేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బల్దియా అధికారులకు పిలుపునిచ్చారు. అంటువ్యాధులు, రోడ్లు తదితర సమస్యలపై సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధికారులతో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పువల్ల వైరల్ జ్వరాలు, అంటువ్యాధులు వ్యాప్తిచెందుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పలుమార్లు దవాఖానలను సందర్శించి పరిస్థితిపై అనేకసార్లు సమీక్షలు నిర్వహించారన్నారు. జ్వరాలన్నీ డెంగీ కాదని, అనవసరంగా దుష్ప్రచారం జరుగుతున్నట్లు చెప్పారు.

వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీజనల్ వ్యాధులపై ఓ క్యాలెండర్ రూపొందించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆయా కాలాల్లో వచ్చే వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ క్యాలెండర్ రూపొందించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్‌తోపాటు జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వైద్యాధికారులు ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పారిశుధ్య స్థితిని గమనించేందుకు మంగళవారం నుంచి ఉదయం ఐదున్నర-ఆరు గంటలకే మేయర్, కార్పొరేటర్లు సహా అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్యపనులను పర్యవేక్షించడంతో పాటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రోజుకు కనీసం మూడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిశ్చయించినట్లు తెలిపారు. ఢిల్లీ తరహాలో ఈ అవగాహన కార్యక్రమాలు స్కూళ్లు, కాలేజీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్లు తదితర వాటిలో నిర్వహించనున్నట్లు చెప్పారు.

చేనేత వస్ర్తాలతో కేటీఆర్ సమీక్షకు
రాష్ట్రంలో చేనేతను ప్రోత్సహించడానికి ప్రతి సోమవారం అధికారి నుంచి సిబ్బంది వరకు చేనేత వస్ర్తాలను ధరించాలన్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులంతా సోమవారం చేనేత దుస్తులు ధరించారు. బల్దియా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ సహా అడిషనల్ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లంతా చేనేత దస్తులు ధరించి హాజరయ్యారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...