పర్యావరణ పరిరక్షణకు ఫ్రాబ్స్ చొరవ భేష్


Tue,September 10, 2019 04:46 AM

ఎస్‌ఆర్‌నగర్ (ఫ్రాబ్స్) అధ్యక్షులు ఆర్.సి.కుమార్ పక్షం రోజులుగా వినాయక మట్టి ప్రతిమలు ఏర్పాటు చేసుకోవాలని ప్రచా రాన్ని నిర్వహించడమే కాకుండా, సంస్థ తరపున దాదాపు 800 మట్టి వినా యక ప్రతిమలను ఇంటింటికి పంపిణీ చేయడం గొప్ప విషయని మంత్రి తలసాని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు తోడ్పాటుగా మండపాల్లో మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ లకు మంత్రి తలసాని చేతుల మీదుగా ఫ్రాబ్స్ ప్రోత్సాహక బహుమతులు అందించే కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఫ్రాబ్స్ ప్రతినిధులు అమరేశ్వరి, టీవీఎన్ రెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, నాగేంద్రమ్మ, రాము, బొడ్డు శ్రీనివాస్‌గౌడ్, షాబాద్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...