మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తా


Tue,September 10, 2019 04:45 AM

బొల్లారం: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ సంస్థ కృషి చేస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం జూబ్లీ బస్ స్టేషన్ ఈడీ కార్యా లయంలో విలేకరుల సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఈడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేం దుకు నగరంలో కాలుష్యాన్ని నివారించేందుకు పొగలేని బస్సులు నడుపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 15 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన బస్సులను డిపోకే పరిమితం చేస్తామన్నారు. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు ఉన్న చోట తప్పని సరిగా బస్సులను ఆపుకొని ప్రయాణికులను ఎక్కించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బస్టాప్ లో బస్సులను నిలుపకపోయినా, కండక్టర్, డ్రైవర్ ప్రయాణికులతో అమర్యా దగా ప్రవర్తించిన వెంటనే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...