జలమండలికి రూ. 825కోట్లు కేటాయింపు


Tue,September 10, 2019 04:43 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ ప్రజలకు తాగు నీటి అవసరాలకు సర్కార్ ప్రాధాన్యతనిచ్చింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా రాబోయే రోజుల్లో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీటి అందిస్తామన్న లక్ష్యానికి అనుగుణంగా కేటాయింపులు చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో భాగంగా జలమండలికి రూ. 825కోట్లను కేటాయించారు. నగర దాహర్తికి పరిష్కారంగా చేపట్టిన కృష్ణా, గోదావరి, హడ్కో ప్రాజెక్టుల కింద రుణాలకు గానూ ఈ నిధులను వెచ్చించనున్నారు.
హెచ్‌ఎండీఏకు రూ. 20 లక్షలు ..

హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ప్రభుత్వం రూ. 20 లక్షలు కేటాయించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ. 1700కోట్ల ప్రతిపాదనలు సమర్పించగా, ప్రభుత్వం ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు జైకా రుణాల చెల్లింపులకు ఈ నిధులను కేటాయించారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...