గ్రేటర్‌కు ప్రాధాన్యం..


Mon,September 9, 2019 01:20 AM

-పదవుల కేటాయింపులో ఇక్కడి నేతలకు చోటు
-తాజా మంత్రివర్గ విస్తరణలో సబితకు అవకాశం
-నాలుగుకు చేరిన మంత్రుల సంఖ్య
-అసెంబ్లీ విప్‌గా ఎమ్మెల్యే గాంధీకి ఛాన్స్‌
-టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం
సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంలో గ్రేటర్‌కు సమ ప్రాధాన్యత లభిస్తున్నది. ఇక్కడి నేతలకు కీలక పదవులు దక్కుతున్నాయి. తాజాగా ఆదివారం చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కేబినెట్‌ బెర్తు దక్కింది. అందులో కీలకమైన విద్యాశాఖ అప్పగించడంతో ప్రాధాన్యత మరింత పెరిగినట్లయింది. ఇప్పటికే గ్రేటర్‌ నుంచి మేడ్చల్‌ శాసనసభ సభ్యులు మల్లారెడ్డి, సనత్‌నగర్‌ శాసనసభ సభ్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ మహమూద్‌ అలీ మంత్రులుగా కొనసాగుతున్నారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి నాలుగో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా టి. పద్మారావు కొనసాగుతుండగా, రెండు రోజుల కిందట అసెంబ్లీ విప్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి చోటు దక్కింది. గ్రేటర్‌లో మంత్రుల సంఖ్య నాలుగుకు చేరుకోవడంతో గ్రేటర్‌ అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

మిన్నంటిన సంబురాలు
తాజా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో గ్రేటర్‌ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కార్పొరేటర్లు ఎక్కడికక్కడి పార్టీ నేతలతో కలిసి ఆయా కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో సంబురాలు మిన్నంటాయి. బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ.. సంబరాలు జరిపారు. ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు నేతృత్వంలో శ్రేణులు భారీగా భవన్‌కు తరలివచ్చి సంబురాలు జరుపుకొన్నారు. మహిళలు నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌ కత్తి సాము చేసి ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడంతో , అభివృద్ధిలో మంత్రిగా తనదైన మార్కు ప్రతిభను చాటిన కేటీఆర్‌కు మరోసారి ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించడంతో హైదరాబాద్‌ మరింత అభివృద్ది చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...