అవకాశాలు అందిస్తే సబ్బండ వర్ణాలు ఉన్నత స్థితికి


Mon,September 9, 2019 01:18 AM

రవీంద్రభారతి/సైదాబాద్‌/చాంద్రాయణగుట్ట నమస్తే తెలంగాణ: విద్యతోనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. టీచర్స్‌డే సందర్భంగా రవీంద్రభారతిలో మహాత్మాఫూలే ఫౌండేషన్‌ ట్రస్ట్‌, ఎంబీసీ టైమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సబ్బండ వర్ణాల ఉపాధ్యాయుల మహాసమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేధో శక్తికి కులమతాలతో సంబంధంలేదని, అవకాశాలు అందిస్తే అన్ని వర్గాల వారు ఉన్నతంగా ఎదగవచ్చన్నారు.తెలంగాణ బాగుపడాలంటే చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలని భావించిన ముఖ్యమంత్రి బీసీలకోసం అడగకుండానే 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రం వచ్చిన తరువాత హాస్టల్‌లలో డి.పి.టి సన్నబియ్యం అమలు చేసింది దేశంలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని అన్నారు. మట్టిలో మాణిక్యాలను గొప్పగా చేయటం ప్రభుత్వ లక్ష్యం అంటూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ సందర్భంగా సబ్బండ వర్ణాలకు చెందిన 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.

గౌలిపురాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠ శాల శాలిబండలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనాథ్‌, 2019 పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు తనవంతు సహాయంగా రూ.30 వేల రూపాయల ఆర్థిక సహాయంను అందజేశారు. ఈ సందర్భంగా మహాత్మాపూలే ఫౌండేషన్‌ ట్రస్టు శ్రీనాథ్‌ను అవార్డుకు ఎంపిక చేశారు మహాత్మాఫూలే ఫౌండేషన్‌ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు సంగెం సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ బి.సి.కమిషన్‌ సీనియర్‌ సభ్యులు డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, రచయిత, డా.డి.విజయభాస్కర్‌, మహాత్మా జ్యోతిభ ఫూలే తెలంగాణ వెనుకబడిన తర గతుల సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు, తెలంగాణ వెనుకబడిన తరగతుల ఇంజనీర్ల సమాఖ్య అధ్యక్షులు దేవల్ల సమ్మయ్య తదితరులు అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను తెలియజేశారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...