ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన కుమ్రంభీం జీవిత చరిత్ర


Mon,September 9, 2019 01:18 AM

రవీంద్రభారతి : గిరిజన హక్కుల సాధనకోసం నిజాం నిరంకుశ పాలకులను ఎదురొడ్డి పోరాడిన కుమ్రంభీం జీవిత చరిత్రను కనులకు కట్టేలా ప్రదర్శించారు పలువురు కళా కారులు. రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పెరల్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ఈ చారిత్రక నాటకాన్ని జనరంజకంగా ప్రదర్శించారు. జల్‌, జంగల్‌,జమీన్‌ నినాదంతో తన జాతికోసం భూతల్లిని ముద్దాడిన గొప్ప పోరాట వీరుడు కుమ్రంభీం. ఆ యోధుడి జీవిత చరిత్రను సజీవంగా చూపించి ప్రేక్షకుల్లో స్ఫూర్తిని అందించారు. శరత్‌ సుంకరి రచన దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకంలో కుమ్రంభీంగా శరత్‌ సుంకరి ప్రధాన పాత్రను పోషించారు.
అంతకు ముందు తెలంగాణ సంగీత నాటక అకా డమీ అధ్యక్షులు బాద్మి శివకుమార్‌, తెలంగాణ బి.సి.కమిషన్‌ సీనియర్‌ సభ్యులు డా. వకుళాభరణం కృష్ణ మోహన్‌ రావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , దైవజ్ఞశర్మ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నాటకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ వీరులకు నివాళిగా నాటకాలు ప్రదర్శించడం జరుగుతుందంటూ నాటక ప్రదర్శన నేపథ్యాన్ని వివరించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...