370, 35ఏ రద్దు చారిత్రక నిర్ణయం : బండారు


Mon,September 9, 2019 01:17 AM

కాచిగూడ, సెప్టెంబర్‌ 8 : ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ అన్నారు. కాచిగూడలోని బద్రుక కళాశాల ఆడిటోరియంలో ఆదివారం బద్రుక కళాశాల కామర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బద్రుక అలూమిని సంయుక్త ఆధ్వర్యంలో ‘370, 35ఏ ఆర్టికల్‌ రద్దు-దాని పరిణామాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండారు దత్తాత్రేయ పాల్గొని మాట్లాడుతూ 370, 35ఏ ఆర్టికల్‌ను అడ్డం పెట్టుకుని పాకిస్తాన్‌ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం, ఏర్పాటు వాదాన్ని పెంచి పోశించిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు పుస్సేంద్ర కలశ్రీష్ట, బద్రుక కళాశాల కార్యదర్శి ముకుంద్‌లాల్‌ బద్రుక, ప్రొఫెసర్‌, ప్రిన్సిపాల్‌ సోమేశ్వర్‌రావు, టీఎల్‌ఎన్‌ స్వామి, రాజేశ్‌ అగర్వాల్‌, అలూమినియం అధ్యక్షుడు దుశ్వంత్‌రెడ్డి, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...