సంప్రదాయం ఉట్టిపడే..ఓనం అదిరిపోయే


Mon,September 9, 2019 01:16 AM

సిటీబ్యూరో, కంటోన్మెంట్‌ (నమస్తే తెలంగాణ) : కేరళ వాసుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింభంగా నిలిచే పండుగ ఓనం. నగరంలో ఓనం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మలయాళీలు ఆడుతూ.. పాడుతూ.. నృత్యాలతో సందడి చేస్తున్నారు. నాయర్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని ఎంఎంఆర్‌ గార్డెన్‌లో ఆదివారం జరిగిన ఓనం ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. ముగ్గులు, వింధుభోజనాలు, పులివేషాలు, ప్రాచీన ఆటలు, పడవ పోటీలు ఆకట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో యువతులు, మహిళలు, పిల్లలు పాల్గొని సరదాగా గడిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పీతాంబర కురుప్‌ హాజరై ఉత్సవాలను ఎక్లీన్‌ టెక్నాలజీస్‌ ఎండీ గోపితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళీయుల ఆరాద్యధైవం ఆచార్య మన్నాత్‌ పద్మనాభన్‌ను ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన నాయర్‌ సర్వీస్‌ సోసైటీ అధ్యక్షుడు సి.జి.చంద్రమోహన్‌ మాట్లాడుతూ కేరళ రాష్ర్టానికి చెందిన ప్రజలు ప్రతి యేటా సెప్టెంబర్‌ మాసంలో ఓనం ఉత్సవాలను జరుపుకోవడం అనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం జర్నలిజంలో చేసిన కృషికి గాను చంద్రమోహన్‌కు మన్నతాచార్య పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. అదేవిధంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాలు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ జి.సురేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయర్‌ సర్వీస్‌ సోసైటీ ఉపాధ్యక్షులు జి.రమేశ్‌కుమార్‌, వి.అప్పుకుట్టన్‌, ప్రధాన కార్యదర్శి జి.సురేశ్‌కుమార్‌, కోశాధికారి యు.కె.నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...