నవంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్


Sun,September 8, 2019 12:48 AM

మలేరియా, డెంగీ నివారణ చర్యలపై శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేష్‌కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్ చివరి వరకు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దోమల నివారణ చర్యలు కొనసాగించాలని, వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన హయాత్‌నగర్, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, అంబర్‌పేట్, మూసాపేట్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...