ఆది నుంచి వివాదాస్పదమే..


Sun,September 8, 2019 12:46 AM

జిల్లా రెవెన్యూలో తహసీల్దార్ జుబేదాబేగం వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇక జిల్లాలో ఆమె పని చేసిన చోటల్లా వివాదాస్పదం కావడం, ఆమె పనితీరుపై విమర్శలు రావడం సర్వసాధారణమవుతున్నది. సికింద్రాబాద్‌లో తహసీల్దార్‌గా పనిచేసిన కాలంలో చాలా ఆరోపణలు వచ్చాయి. కిందిస్థాయి ఉద్యోగులను దుర్బాషలాడటం, కులదూషణ ఆరోపణలు వచ్చాయి. డబ్బులు వసూళ్ల వ్యవహారం కూడా నెరిపినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. తర్వాత ఆమెను బదిలీచేసి బండ్లగూడ తహసీల్దార్‌గా నియమించారు. అక్కడ సైతం కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆమెను చార్మినార్ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. చార్మినార్‌లో దళారీలను ప్రొత్సహించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పింఛన్ల పక్కదారి కుంభకోణం వెలుగు చూసింది.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...