పింఛన్ల పక్కదారి వ్యవహారంలో తహసీల్దార్‌పై వేటు


Sun,September 8, 2019 12:45 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పింఛన్లు పక్కదారి పట్టిన వ్యవహారంలో చార్మినార్ తహసీల్దార్ జుబేదాబేగంపై వేటుపటింది. ఆమెను తహసీల్దార్‌గా తప్పిస్తూ కలెక్టర్ మాణిక్‌రాజ్‌కన్నన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఆ స్థానంలో హైదరాబాద్ రెవె న్యూ డివిజినల్(ఆర్డీఓ) కార్యాలయ పరిపాలనాధికారి శ్రీనివాస్‌రెడ్డిని తహసీల్దార్‌గా నియమించి, అదనపు బాధ్యతలు అప్పగించారు. జుబేదాబేగంను కలెక్టరేట్‌లో రిపోర్ట్‌చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. చార్మినార్ మండలకేంద్రంగా 225మంది పింఛన్ల సొమ్ము ఒకరి ఖాతాకు బదులుగా, మరొకరి ఖాతాకు మళ్లడం తెలిసిందే. ఈ వ్యవహారంలో తహసీల్దార్ నిర్లక్ష్యం కొట్టచ్చినట్లుగా కనిపించడం, ఏకంగా తహసీల్దార్ ఐడీని వాడుకునే ఖాతా నంబర్లు మార్చినా, గుర్తించకపోవడాన్ని సీరియస్‌గా పరగణించారు. ఇక అత్యంతగోప్యంగా ఉంచాల్సిన తహసీల్దార్ ఐడీ ఆమో ప్రమేయం లేకుండా ఏలా లీకవుతుందన్న కోణంలో విచారణ చేసిన అధికారులు ఆమె నిర్లక్ష్యంగా కారణంగానే అక్రమాలు చోటుచేసుకున్నాయని తేల్చారు. పైగా ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుండటం, అమె అక్కడే ఉంటే, ఆధారాలను మాయం చేయడం, విచారణను ప్రభావితం చేస్తారన్న ఆలోచనతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లుగా ఓ రెవెన్యూ అధికారి నమస్తే తెలంగాణకు తెలిపారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...