రక్తహీనతను అధిగమిద్దాం


Sun,September 8, 2019 12:44 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జిల్లాలో కిశోరబాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని, పోషణ్ అభియాన్‌లో భాగంగా రక్తహీనత సమస్యను అధిగమించాలని జిల్లా సంయుక్త కలెక్టర్(జేసీ) గుగులోతు రవి పిలుపునిచ్చా రు. పోషణ్ అభియాన్‌పై పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ రాజధాని నగరంలో బాలికలు రక్తహీనతతో బాధపడుతుండటం ఆందోళనకరమని ఈ సమస్యను అధిగమించాలన్నారు. పోషణ్‌అభియాన్‌లో భాగంగా పేర్కొన్న 5 సూత్రాలైన మొదటి వెయ్యిరోజుల కార్యక్రమం, అధిక పోషకాలు గల ఆహారాన్ని తీసుకోవడం, రక్తహీనత, విరేచనాలు-నివారణ, పరిశుభ్రత, పారిశుధ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో మహిళా, శిశు సంక్షేమశాఖ పీడీ ఝాన్సీలక్ష్మి, హైదరాబాద్ డివిజన్ ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, సీపీఓ రామభద్రం, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.టి. వెంకటి, డీఈఓ బి.వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...