సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌ను సందర్శించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్�


Sun,September 8, 2019 12:44 AM

ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ శనివారం ఎల్బీనగర్ జోన్ పరిధిలోని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌ను సందర్శించారు. నగరంలోని హుస్సేన్‌సాగర్ అనంతరం పెద్ద సంఖ్యలో వినాయకుల నిమజ్జనం జరిగే సరూర్‌నగర్ మినీట్యాంక్‌బండ్‌ను జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి లోకేష్‌కుమార్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించా రు. ఈ సందర్భంగా చెరువు పరిస్థితులను, నిమజ్జనం కోసం తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన నాగోలు బ్రిడ్జ్జి వద్ద నున్న చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను కూడా సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ విజయకృష్ణ, ఈఈ నరేందర్‌గౌడ్, ఏఎంఓహెచ్ డాక్టర్ మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...