వ్యాధుల నివారణ చర్యల పరిశీలనకు తనిఖీలు


Sun,September 8, 2019 12:42 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌లో అంటువ్యాధుల నివారణ కోసం చేపట్టిన చర్యలను పరిశీలించేందుకు శనివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌తోపాటు ఉన్నతాధికారులు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ ఎల్బీనగర్ జోన్‌లోని నాగోలు, ఉప్పల్ ప్రాంతాల్లో పర్యటించగా, పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్ శృతిఓజా గోషామహల్, మంగళ్‌హాట్ తదితర ఏరియాలను సందర్శించారు. చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబుతోపాటు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ అధికారులు తమతమ ప్రాంతాల్లో పర్యటించి ఎంటమాలజీ, పారిశుధ్య విభాగం ద్వారా నిర్వహిస్తున్న లార్వానిరోధక స్ప్రేయింగ్, పెరిత్రయం, ఐఆర్‌ఎస్ మిశ్రమాల స్ప్రేయింగ్ పనులను పరిశీలించారు. ముఖ్యంగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై వారు దృష్టి కేంద్రీకరించారు. ఈ సందర్భంగా పాత టైర్లు, డబ్బాలు, కూలర్లు తదితర వాటిల్లో నిల్వవున్న నీటిని తొలగించి దోమలు ఉత్పత్తి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, బస్తీల్లో దోమల నివారణపై విస్తృతంగా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...