పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి


Sat,September 7, 2019 03:06 AM

-జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి
కీసర : డెంగీ జ్వరాలకు కారణమైన పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పంచాయతీలకు ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి పేర్కొన్నారు. కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సెంటర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు సంబంధించిన వసతి సదుపాయాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో హరితహారం కింద నాటిన మొక్కలను, పరిసరాలను పరిశీలించారు. దవాఖానలో రోగుల బంధువులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంటు వ్యాధులను నివారించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు స్థానిక పంచాయతీ వారితో అనుసంధానం చేసుకొని గ్రామాల్లో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

అంటు వ్యాధులను నిర్మూలించే ప్రక్రియను గ్రామాల్లో వేగవంతం చేయాలని, ప్రతిఏటా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులే ఎక్కువగా ఉన్నాయని, డెంగీ జ్వరాలు సోకుతున్నాయని, దీంతో ప్రజానీకం అంతా బెంబేలెత్తుతుందని, సీజనల్ వ్యాధుల నివారణకు ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ ఆప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి, కీసర ఎంపీడీవో శశిరేఖ, మండల జడ్పీటీసీ బెస్త వెంకటేశ్, కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సరిత, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణలతోపాటు స్థానిక వైద్య బృందం పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...