ప్రభుత్వ పాఠశాలలను నంబర్ వన్ స్థానంలో నిలపాలి


Sat,September 7, 2019 03:05 AM

మేడ్చల్ కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలలను నంబర్ వన్ స్థానంలో నిలపాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం, దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి పాల్గొని ఉపాధ్యాయులకు నూతన వస్ర్తాలను అందజేసి ఘనంగా సత్కరించారు. పాఠశాలలను దత్తత తీసుకొని గదులకు రంగులు వేసి అభివృద్ధి చేసిన నాగారం మాజీ సర్పంచ్ కౌకుట్ల చంద్రారెడ్డి, దమ్మాయిగూడ టీఆర్‌ఎస్ నేత మాదిరెడ్డి నరేందర్‌రెడ్డిలను మంత్రి ఘనంగా సత్కరించారు. అంతకు ముందు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌నగర్, నేతాజీనగర్, మల్లికార్జున్‌నగర్, దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్, విజయపురి కాలనీ, అయ్యప్ప కాలనీ, సాయిపురి కాలనీ, భవానీనగర్, బండ్లగూడలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, కష్టపడి చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలన్నారు. ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల ప్రతిష్ట పెంచాలన్నారు.

10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు. 10లో 10 పాయింట్లు సాధించిన విద్యార్థులకు రూ.25వేలు అందజేస్తానని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను అందజేస్తుందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి జరిగాయన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రామలింగం, సహకార సంఘం చైర్మన్ కౌకుట్ల కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత, మాజీ సర్పంచ్‌లు నానునాయక్, అనిల్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌రావు, నాయకులు గూడూరు ఆంజనేయులుగౌడ్, సంపనబోలు నర్సింహా గౌడ్, బిజ్జ శ్రీనివాస్‌గౌడ్, బండారి మల్లేశ్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...