బతుకమ్మ చీరలకు జాబితా సిద్ధం


Sat,September 7, 2019 03:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి పౌరసరఫరాల శాఖ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది. 18 సంవత్సరాలు నిండిన మహిళలను అర్హులుగా గుర్తిస్తూ 9 సర్కిళ్లలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ కార్యాలయం పరిధిలో 8,43,680 మందిని ఎంపిక చేశారు. నగరంలోని మలక్‌పేట, యాకూత్‌పూర, చార్మినార్, నాంపల్లి, మెహిదీపట్నం, అంబర్‌పేట్, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్ సర్కిళ్లలో విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులను ఎంపికచేశారు. వీరందరికీ పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేయనున్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...