అన్ని దేశాల చూపు.. హైదరాబాద్ వైపే


Sat,September 7, 2019 03:03 AM

మాదాపూర్, సెప్టెంబర్ 6 : హైదరాబాద్ దేశంలోని ఇండస్ట్రియల్ ఉత్పత్తులను శాసించే ఏకైక నగరంగా అభివృద్ధి చెందిందని లోకేశ్ ఇండస్ట్రి డైరెక్టర్ శ్రీ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఇండ్ ఎక్స్ పో కార్యక్రమాన్ని నిర్వాహకుడు రాజ్‌కుమార్ అగర్వాల్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేజర్ కటింగ్ టెక్నాలజీ ఒకప్పుడు ఎంతో ఖరీదైనదని, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అందరికి అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆర్థిక మాంద్యం సమయంలో ఇటువంటి ప్రదర్శనలను ఏర్పాటు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చన్నారు. హైదరాబాద్ నగరంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో అన్ని దేశాలు హైదరాబాద్ వైపు చూడటం ఖాయమని, ఇప్పటికే పలు దేశాలు హైదరాబాద్ వైపు చూడటం జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శనలో పలు రకాల ఇండస్ట్రీయల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు.

మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో దాదాపు 20వేలకు పైగా సందర్శకులు పలు రాష్ర్టాల నుంచి విచ్చేయనున్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందులో ఏర్పాటు చేసిన ప్రదర్శనతో సంవత్సరంలో నూట అరవై కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరిగే సూచనలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పలు రకాల ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఉత్పత్తులతో పాటు ఆస్ట్రియా, చైనా దేశాలకు చెందిన వివిధ కంపెనీలు కొలువుదీరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...