ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి


Sat,September 7, 2019 03:02 AM

హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 6 : అగ్రవర్ణ పేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లను ఇతర రాష్ర్టాలు అమలు చేస్తున్నాయని, ఈ రిజర్వేషన్లు అమలుతో అగ్రవర్ణ పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియలో అగ్రవర్ణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జ్యోకం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయింపుతో పాటు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో వేదిక రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, వెంకట్ రెడ్డి, రవీంద్రారెడ్డి, చంద్రారెడ్డి, బాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, చక్రరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బాపురెడ్డి, కవిత, విజయ, రాజ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...