అనురాగ్‌లో గురుపూజోత్సవం


Sat,September 7, 2019 03:01 AM

ఘట్‌కేసర్ : అధ్యాపకులు విద్యార్థులకు ఆదర్శవంతులుగా ఉండాలని ప్రముఖ సినీ కవి రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసన మండలి విప్, కళాశాల చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కవి సుద్దాల అశోక్ తేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు కవి అశోక్‌తేజను కళాశాల చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సత్కరించారు. కళాశాల సెక్రటరీ పల్లా నీలిమ, డైరెక్టర్ కేఎస్.రావు, డీన్ ముత్తారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ విష్ణుమూర్తి, హెచ్‌వోడీలు వసుధభక్షి, విజయ్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ మల్లేశ్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...