13 అంశాలు..పలు అభివృద్ధి పనులు


Fri,September 6, 2019 12:47 AM

-బల్దియా స్టాండింగ్ కమిటీ తీర్మానాలు
-దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై 5.10 కోట్లతో లైటింగ్ సిస్టం
-మీరాలం పార్కులో 2.90 కోట్లతో మ్యూజికల్ ఫౌంటెన్

కంటోన్మెంట్, (నమస్తే తెలంగాణ):యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జాబ్ కనెక్ట్ ఇన్‌చార్జి, కార్ఖానా ఇన్‌స్పెక్టర్ మధుకర్‌స్వామి అన్నారు. గత నెల 24వ తేదీన సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీలో పోలీస్ జాబ్ కనెక్ట్ మేళా నిర్వహించిన విషయం విదితమే. ఈ జాబ్‌మేళాలో 2200 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనగా, 72 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. అదేరోజున 192 మందికి పలు కంపెనీలు ఉద్యోగ అవకాశాలను కల్పించాయి. మరో 700 మంది అభ్యర్థుల షార్ట్‌లిస్టును రూపొందించారు. గురువారం ఎస్వీఐటీ ప్రాంగణంలోనే మరో 120 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ.. పలు కంపెనీలు నియామక పత్రాలను అందజేశాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో కార్ఖానా ఇన్‌స్పెక్టర్ మధుకర్‌స్వామి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నేతాజీలు పాల్గొని ఉద్యోగాలు పొందిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మధుకర్‌స్వామి మాట్లాడుతూ.. యువతకు ఉపాధి లేనందునే చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన, వాటిపై అవగాహన పెంచేందుకు జాబ్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నగర పోలీస్ విభాగం ఎల్లవేళలా సహకారం అందిస్తుందన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్లలో యువత, తమ బయోడెటాను అందజేసి, ఈ మొయిల్, ఫోన్ నంబర్, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రముఖ నానోజిల్ టెక్నాలజీ, ఐటీమ్, టీడబ్ల్యూజీ, ఆపోలో ఫార్మసీ, వింబటా ట్యాబ్స్‌తోపాటు పేరొందిన పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొని గురువారం అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలు కంపెనీల ప్రతినిధులు అరుణ్ బొండా, ఇమ్రాన్ నహీమ్, సునీల్, ఎస్వీఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజు, ఫిజికల్ డైరెక్టర్ ఫండరి తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...